BJP: అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం.. ఆదేశిస్తే శ్రీలంక నుంచైనా పోటీ!: బాబు మోహన్

  • నాకు శ్రీలంకలోనూ అభిమానులున్నారు
  • నా ఫొటో పెట్టుకుని గెలిచారు
  • బీజేపీలో ఎందుకు చేరిందీ త్వరలోనే వెల్లడిస్తా
టీఆర్ఎస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న బాబు మోహన్ అధిష్ఠానం నిర్ణయమే తనకు శిరోధార్యమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్న విలేకరుల ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి బరిలోకి దిగుతానన్నారు. శ్రీలంక నుంచి పోటీ చేయమన్నా అక్కడి నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు. తనకు అక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారని, తన ఫొటో పెట్టుకుని అక్కడి మునిసిపల్ ఎన్నికల్లో చాలామంది గెలుపొందారన్నారు. తాను బీజేపీలో చేరడానికి గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తానని బాబుమోహన్ పేర్కొన్నారు.
BJP
Telangana
Babu Mohan
Sri Lanka
Election

More Telugu News