Pakistan: భారత గగనతలంలోకి చొరబడిన పాకిస్థాన్ హెలికాప్టర్ లో ఎవరున్నారో తెలుసా?

  • హెలికాప్టర్ లో పీఎకే ప్రధాని, ఇద్దరు మంత్రులు
  • కింద నుంచి కాల్పులు జరిపిన భారత సైన్యం
  • వెనక్కి వెళ్లిపోయిన హెలికాప్టర్
నిబంధనలను ఉల్లంఘించి భారత గగనతలంలోకి పాకిస్థాన్ కు చెందిన ఓ హెలికాప్టర్ ప్రవేశించిన సంగతి తెలిసిందే. భారత సైనికులు కాల్పులు జరపడంతో, ఆ హెలికాప్టర్ మళ్లీ వెనక్కి వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆ ఛాపర్ లో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాన మంత్రి రాజా ఫరూక్ హైదర్ ఖాన్, ఆయన భద్రతాధికారులు, ప్రావిన్స్ విద్యాశాఖ మంత్రి ఇఫ్తికర్ గిలానీ, పర్యాటక మంత్రి ముస్తాక్ విన్ హాస్ లు ఉన్నారు.

ఈ సందర్భంగా ముస్తాక్ మాట్లాడుతూ, ఎయిర్ స్పేస్ నిబంధనలను ఉల్లంఘించామనే విషయం తమకు తెలియదని... తమపైకి కింద నుంచి కాల్పులు జరుగుతున్నాయనే విషయం తమకు అర్థమైందని... తమ గమ్యం చేరుకున్న తర్వాతే, తమ హెలికాప్టర్ పై కాల్పులు జరిపింది భారత సైన్యం అనే విషయం తెలిసిందని చెప్పారు.  
Pakistan
India
helicopter
firing

More Telugu News