అభివృద్ధి సాధించాలంటే రిజర్వేషన్లు అవసరం లేదు!: లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ సంచలన వ్యాఖ్యలు
- మన ఆలోచనలు, చేతలు మారితే చాలు
- రిజర్వేషన్ల కారణంగా దేశం ఏం బాగుపడింది
- జార్ఖండ్ లో ప్రసంగించిన స్పీకర్
అభివృద్ధి, సామాజిక ప్రగతి సాధించాలంటే రిజర్వేషన్లు అవసరం లేదనీ, మన ఆలోచనలను, చేతలను మార్చుకోవాలని మహాజన్ తెలిపారు. అలా చేసినప్పుడే అంబేడ్కర్ కన్న కలలు సాకారం అవుతాయని వెల్లడించారు. గతంలో బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంగా బీజేపీ చీఫ్ అమిత్ షా అభివర్ణించారు. తాము రిజర్వేషన్ల ఉపసంహరణ జోలికి పోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.