Ponnam Prabhakar: భారత పౌరసత్వం లేని వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారు?: పొన్నం ప్రభాకర్

  • సోనియా లేకపోతే కేసీఆర్, కేటీఆర్, కవితలు ఎక్కడుండేవారు?
  • కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
  • పాలించడం చేతకాకే అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత పౌరసత్వం లేని వ్యక్తికి వేములవాడ టికెట్టును మళ్లీ ఎలా ఇస్తారని మండిపడ్డారు. కొండగట్టు ఆర్టీసీ బస్సు ప్రమాదంలో భారీ సంఖ్యలో ప్రయాణికులు చనిపోతే... మృతుల కుటుంబీకులను పరామర్శించే తీరిక కూడా కేసీఆర్ కు లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు గులాంలు అంటూ కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, సోనియాను దూషించిన కేటీఆర్ ఒక మూర్ఖుడు అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ లేకపోతే కేసీఆర్, కేటీఆర్, కవితలు ఎక్కడ ఉండేవారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే గడీల పాలనకు ఓటు వేసినట్టేనని... గడీల పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. పరిపాలించడం చేతకాకే... నాలుగున్నరేళ్లకే అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేశారని దుయ్యబట్టారు.
Ponnam Prabhakar
KCR
KTR
kavitha
TRS
congress
Sonia Gandhi

More Telugu News