Bengaluru: రేప్‌ చేస్తానని బెదిరించి కటకటాల పాలయ్యాడు!

షార్ట్స్‌లో చూడండి
బెదిరించాలనే అనుకున్నాడో...మహిళ ముందు పోజ్‌ కొట్టాలని చూశాడో... పర్యవసానాలు ఊహించని ఆకతాయితనమో నోరు జారి పీకలమీదికి తెచ్చుకున్నాడో ద్విచక్ర వాహన చోదకుడు. ‘రేప్‌ చేస్తాను’ అని ఓ మహిళను బెదిరించి కటకటాలపాలయ్యాడు. బెంగళూరు నగరం తిలక్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి.

తిలక్‌నగర్‌లోని బిలాల్‌ మసీదు కూడలి వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడింది. కారులో వెళ్తున్న ఓ మహిళ తన వాహనాన్ని ఆపింది. ఆమె వెనుకే ద్విచక్ర వాహనంపై వస్తున్న చంద్రశేఖర్‌ అనే వ్యక్తి గట్టిగా హారన్‌ కొట్టాడు. దారివదలాలని కోరాడు. ఆమె పట్టించుకోకపోవడంతో కారు వద్దకు వచ్చి దుర్భాషలాడాడు. దారివ్వకుంటే రేప్‌ చేస్తానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా ఆమె కారును వెంబడించాడు. దారిమధ్యలో కారును అడ్డుకుని ఆమె చెయ్యిపట్టుకుని లాగాడు. ఫొటోగ్రాఫర్‌ అయిన ఆ మహిళ చంద్రశేఖర్‌ బైక్‌ నంబర్‌ ఫొటో తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు.
Go Back to Shorts
Bengaluru
Tilaknagar
arrest

More Telugu News