janasena: జనసేనలో చేరిన పవన్ కల్యాణ్ బాల్య మిత్రులు

  • నిన్న రాత్రి పవన్ సమక్షంలో జనసేనలో చేరిన మిత్రులు
  • హైదరాబాద్ సెయింట్ జోసెఫ్ స్కూల్లో విద్యాభ్యాసం
  • జనసేన విజయం కోసం పని చేస్తామన్న బాల్య మిత్రులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాల్య మిత్రులు సమరసింహారెడ్డి, చన్న రాంరెడ్డి, బీఎం సతీష్ లు ఆ పార్టీలో చేరారు. జంగారెడ్డిగూడెంలో నిన్న రాత్రి వారు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి మిత్రులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పవన్. హైదరాబాద్ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పవన్ తో పాటు వీరు చదువుకున్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ మంచితనాన్ని కొనియాడారు. జనసేన అధికారంలోకి రావడానికి తాము పూర్తి స్థాయిలో పని చేస్తామని చెప్పారు. మరోవైపు, పవన్ కల్యాణ్ ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాల్లో పర్యటించనున్నారు. భూనిర్వాసితులతో భేటీ అవుతారు. 
janasena
Pawan Kalyan
friends
join

More Telugu News