Pawan Kalyan: తెల్లవారుజామున రహస్య పూజలు నిర్వహించిన పవన్ కల్యాణ్

  • ఐఎస్ జగన్నాథపురం లోని నరసింహస్వామి ఆలయంలో పూజలు
  • అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారన్న ఆలయ అధికారులు
  • ఈరోజు పోలవరం ముంపు మండలాల్లో పర్యటించనున్న పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ తెల్లవారుజామున రహస్య పూజలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఐఎస్.జగన్నాథపురంలో ఉన్న నరసింహస్వామి ఆలయంలో ఈ తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుంచి 4.30 వరకు ఆయన పూజలు చేశారు. ఈ సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారని ఆలయ అధికారులు తెలిపారు. అయితే, ఈ పూజలను ఎందుకు నిర్వహించారనే విషయం మాత్రం తెలియరాలేదు.

సినీ క్రిటిక్ కత్తి మహేష్ గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ, ఇదే ఆలయంలో పవన్ కల్యాణ్ తాంత్రిక పూజలు నిర్వహించారని ఆరోపించారు. మరోవైపు ఈరోజు పోలవరం ముంపు మండలాల్లో పవన్ పర్యటించనున్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని భూనిర్వాసితులతో ఆయన భేటీ కానున్నారు.
Pawan Kalyan
secret
pooja
janasena
west godavari

More Telugu News