Biggboss: బిగ్ బాస్ హౌస్ బయట రచ్చ రచ్చ చేస్తున్న తన ఆర్మీతో కౌశల్... వీడియో!

  • కౌశల్ గెలుస్తాడని ముందే తెలుసుకున్న ఫ్యాన్స్
  • హౌస్ సెట్ వద్ద సందడే సందడి
  • వారితో కలసి పోయిన కౌశల్
బిగ్ బాస్ సీజన్-2 పూర్తయింది. విజేత కౌశలేనని ముందుగానే తెలిసిపోయింది. దీంతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతున్న స్టూడియో ముందు కౌశల్ ఆర్మీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. తాను విజేతగా నిలిచిన తరువాత, బయట టపాకాయలు కాలుస్తూ, సందడి చేస్తున్న తన ఆర్మీతో కౌశల్ కూడా చేరిపోయాడు. వాహనం పైకి ఎక్కి, తనకోసం వచ్చిన వందలాది మందిని చూస్తూ ఆనందంతో అభివాదం చేశాడు. ఫ్యాన్స్ లో కలసిపోయి ఎంజాయ్ చేశాడు. తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. తనకు బయట ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటం అదృష్టమని అన్నాడు. బిగ్ బాస్ హౌస్ బయట కౌశల్, తన ఆర్మీతో ఉన్న వీడియోను మీరూ చూడవచ్చు.
Biggboss
Koushal
Fans
Army

More Telugu News