Kaushal: కౌశల్ పెద్ద మనసు.. రూ.50 లక్షల ప్రైజ్ మనీని కేన్సర్ బాధిత మహిళలకు విరాళంగా ప్రకటించిన బిగ్‌బాస్-2 విజేత!

  • కేన్సర్‌తో మరణించిన కౌశల్ తల్లి
  • కేన్సర్ బాధిత మహిళలను ఆదుకునేందుకు ముందుకు
  • రూ.50 లక్షల ప్రైజ్ మనీని వారికో వినియోగిస్తానని ప్రకటన
బిగ్‌బాస్-2 విజేతగా నిలిచిన కౌశల్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. ప్రైజ్ మనీగా తనకొచ్చిన రూ.50 లక్షలను కేన్సర్ బాధిత మహిళలకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు. విజేతగా తన పేరును ప్రకటించిన వెంటనే తీవ్ర భావోద్వేగానికి గురైన కౌశల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

విజేతగా నిలిచిన కౌశల్‌కు టాలీవుడ్ నటుడు వెంకటేశ్ అవార్డుతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతిని అందించారు. ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడుతూ.. తన తల్లి కేన్సర్‌తో మరణించిందని పేర్కొన్నాడు. మరే తల్లీ ఇలా కేన్సర్‌తో మరణించకూడదనే ఉద్దేశంతో తనకొచ్చిన రూ.50 లక్షల ప్రైజ్ మనీని కేన్సర్ బాధిత మహిళల కోసం వినియోగిస్తానని ప్రేక్షకులు, ఆహూతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించాడు.
Kaushal
Big Boss
Nani
Cancer
Prize Money
Stat Maa

More Telugu News