big boss: ‘బిగ్ బాస్’ కు ఇక సెలవు.. వుంటాను!: హీరో నాని

  • వ్యాఖ్యాతగా నా చివరి రోజు
  • ఓ అద్భుతమైన అనుభూతి పొందాను
  • వ్యాఖ్యాతగా తనను ఇష్టపడిన వారికి ధన్యవాదాలు
‘బిగ్ బాస్’ సీజన్-2 ఈ రోజుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాని ఓ ట్వీట్ చేశాడు. ఈరోజే ఫైనల్ అని, వ్యాఖ్యాతగా తన చివరి రోజని చెప్పాడు. ఓ అద్భుతమైన అనుభూతిని పొందానని, చాలా నేర్చుకున్నానని, చాలా నేర్చుకోలేనిదీ వుందని నాని పేర్కొన్నాడు. షోను, వ్యాఖ్యాతగా తనను ఇష్టపడిన వారికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నాడు. వ్యాఖ్యాతగా తనను ఇష్టపడని వారికి, థియేటర్ లో కలుద్దామని.. ‘‘బిగ్ బాస్’ కు ఇక సెలవు’ అని నాని తన పోస్ట్ లో పేర్కొన్నారు.
big boss
nani

More Telugu News