Mahabubabad District: జిల్లా పేరును భ్రష్టుపట్టించిన రేవంత్‌రెడ్డి : జెడ్పీ చైర్మన్‌ భాస్కర్‌ ధ్వజం

  • తన అవినీతి సామ్రాజ్యంతో కోట్లు గడించిన రేవంత్‌
  • పుష్కరం క్రితం సాధారణ వ్యక్తికి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్న
  • అక్రమ సంపాదన ఉన్నందునే ఐటీ అధికారుల దాడులు
తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకుని కోట్లు కూడబెట్టుకున్న కొడంగల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి జిల్లా పేరును భ్రష్టుపట్టించారని మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండారి భాస్కర్‌ ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని తన క్వార్టర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2006లో సాధారణ వ్యక్తిగా ఉన్న రేవంత్‌రెడ్డికి 2018 నాటికి వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే అయ్యాక దోపిడీ పాలనకు తెరతీయడం వల్లే కోట్లు సంపాదించగలిగాడని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి వద్ద అక్రమ సంపాదన ఉండడం వల్లే ఐటీ అధికారులు దాడులు నిర్వహించారని, ఈ కేసులో రేవంత్‌రెడ్డికి ఏ శిక్ష విధించినా తక్కువేనని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డికి మద్దతిస్తున్న చిన్నారెడ్డి, డి.కె.అరుణల తీరుపై విచారణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
Mahabubabad District
ZP chairman
Revanth Reddy

More Telugu News