Taxiwala: విడుదలకు ముందే వచ్చేసిన 'టాక్సీవాలా'... మొబైల్స్ లో చూస్తున్న యువకుల అరెస్ట్!

  • పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన
  • ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో విచారిస్తున్న పోలీసులు
  • పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన 'టాక్సీవాలా'
విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమా పైరసీ బారిన పడిన విషయం ఇటీవల తీవ్ర కలకలం రేపగా, అదే సమయంలో ఆయన మరో చిత్రం 'టాక్సీవాలా' పైరసీకి గురైందన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడా వార్తలు నిజమేనని తేలింది. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో కొందరు యువకులు మొబైల్ ఫోన్లలో 'టాక్సీవాలా' చూస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సినిమా వారి మొబైల్స్ లోకి ఎలా వచ్చింది? వారు ఎవరెవరికి ఫార్వార్డ్ చేశారన్న కోణంలో విచారణ సాగిస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. విజయ్ దేవరకొండ సరసన మాళవికా నాయర్, ప్రియాంకలు నటించిన ఈ చిత్రం చానాళ్ల క్రితమే విడుదలకు సిద్ధమైనా, పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
Taxiwala
Geetagovindam
Pairacy

More Telugu News