Hyderabad: ప్రేమ పెళ్లి, మరో ఇద్దరితో సంబంధం... విషయం తెలిసి భార్య ఆత్మహత్యాయత్నం!

  • 2012లో శ్రీలక్ష్మితో వంశీ ప్రేమ వివాహం
  • ఆపై ఆఫీసులో ఒకరు, గోవాలో మరొకరు
  • రెండో పెళ్లికి సిద్ధపడటంతో ఆత్మహత్యాయత్నం
గాఢంగా ప్రేమించిన ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. ఆపై బుద్ధి పెడదారులు తొక్కగా, మరో ఇద్దరు అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య, మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన హైదరాబాద్, బంజారాహిల్స్‌ లో జరిగింది.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఇక్కడి ఎస్వీనగర్‌లో నివసించే శ్రీలక్ష్మి (26), వేణుగోపాల్‌ అలియాస్‌ వంశీ దంపతులది ప్రేమవివాహం. వీరికి 2012లో వివాహం జరిగింది. మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్స్‌ లో పనిచేసే వంశీ, అక్కడే పనిచేస్తున్న మరో యువతితో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం శ్రీలక్ష్మికి తెలిసి, గొడవలు జరిగి విషయం కోర్టు వరకూ వెళ్లింది.

 ఇదిలా ఉండగానే కంపెనీ పనిమీద గోవాకు వెళ్లిన వంశీ, అక్కడ మరో యువతితో సంబంధం పెట్టుకుని, ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేశాడు. ఈ విషయం భార్యకు తెలిసింది. దీంతో తీవ్ర మనో వేదనకు గురైన ఆమె, నిద్రమాత్రలు మింగగా, ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న శ్రీలక్ష్మి సోదరి ప్రశాంతి, ఆమెను ఆసుపత్రికి తరలించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
Hyderabad
BanjaraHills
Vamsi
Police
Sucide Attempt

More Telugu News