నేడు కూడా... హైదరాబాద్, విజయవాడల్లో తాజా పెట్రోలు, డీజిల్ ధరలు!
- పెట్రోలుపై 9 పైసలు, డీజిల్ పై 15 పైసలు వడ్డన
- హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 88.51కి
- ముంబైలో రూ. 90.84కు
దీంతో హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 88.51కి, డీజిల్ ధర రూ. 81.33కు పెరిగాయి. ఇదే సమయంలో విజయవాడలో పెట్రోలు ధర లీటరుకు రూ. 87.86కు, డీజిల్ ధర రూ. 80.35కు చేరింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర రూ. 83.49గా, డీజిల్ ధర రూ. 74.79గా ఉంది. ఇక పెట్రో ఉత్పత్తుల ధరలు అధికంగా ఉండే ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 90.84కు, డీజిల్ ధర రూ. 79.40కి చేరుకుంది.