telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా? లేదా?: మళ్లీ మొదలైన టెన్షన్!

  • నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఎన్నిలకు జరుగుతాయనే వార్తల్లో నిజం లేదు
  • తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా నిర్ణయం తీసుకోలేదు
  • వివరణ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్
ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటే తెలంగాణ అసెంబ్లీకి కూడా ముందస్తుగా ఎన్నికలు జరుగుతున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వార్తలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పష్టతను ఇచ్చారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాదిలోని నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయనే వార్తలు నిజం కాదని చెప్పారు. తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. దీంతో ముందస్తు ఎన్నికలు జరుగుతాయో, లేదో అనే టెన్షన్ మళ్లీ మొదలైంది.
telangana
elections
cec
ceo
rajat kumar

More Telugu News