jagan: టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన జగన్

  • ఆసియా కప్ ను ఏడోసారి గెల్చుకున్న టీమిండియా
  • అభినందనలు తెలిపిన జగన్
  • మేమంతా గర్వించేలా చేశారంటూ ట్వీట్
ఆసియా కప్ ను ఏడోసారి కైవసం చేసుకున్న టీమిండియాపై వైసీపీ అధినేత జగన్ ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా అభినందించారు. 'ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్ పై అద్భుతమైన విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు. విజయం సాధించి మేమంతా గర్వించేలా చేశారు' అంటూ ట్వీట్ చేశారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై టీమిండియా 3 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడిన వేళ చివరి బంతికి భారత్ విజయం సాధించింది. 
jagan
team india
asia cup
YSRCP

More Telugu News