balka suman: జగన్ విచారణను ఎదుర్కుంటున్నారు.. నీవు ఎదుర్కోలేవా?: రేవంత్ పై బాల్క సుమన్ వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
తామంతా తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లినప్పుడు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన ఉన్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. తేలు కుట్టిన దొంగలా ఇప్పుడు రేవంత్ దొరికిపోయారని చెప్పారు. ఇప్పటికీ రేవంత్ చీకటి బాస్ చంద్రబాబు అని... ఆయన అండతో చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారని అన్నారు.

గతంలో రాజశేఖరరెడ్డి మనుషులతో కలసి ఎన్నో పనులు చేశారని విమర్శించారు. ఐటీ శాఖల దాడులకు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎంతో మంది నేతలు విచారణలు ఎదుర్కొంటున్నారని... వైసీపీ అధినేత జగన్ విచారణ ఎదుర్కొంటున్నారని... దమ్ముంటే మీరు కూడా విచారణ చేయించుకోవాలని అన్నారు.

రేవంత్ రెడ్డి చరిత్ర మొత్తం తమకు తెలుసని సుమన్ చెప్పారు. తెలంగాణలోకి కుల రాజకీయాలను చొప్పించేందుకు యత్నిస్తున్నారని... కులాల రాజకీయాలు ఏపీలో ఉంటాయని, తెలంగాణలో కుల రాజకీయాలకు చోటు లేదని అన్నారు. ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే అసెంబ్లీలో బాల్క సుమన్ కూర్చుంటాడో, రేవంత్ రెడ్డి కూర్చుంటాడో చూద్దామని చెప్పారు. రేవంత్ కు ముఖ్యమంత్రి అన్నా, పోలీసు వ్యవస్థ అన్నా గౌరవం లేదని విమర్శించారు. ఇకపై, అనవసర వ్యాఖ్యలు చేస్తే రేవంత్ నాలుకను చీలుస్తామని హెచ్చరించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పారు.
Go Back to Shorts
balka suman
Revanth Reddy
kcr
TRS
congress
Chandrababu

More Telugu News