Pawan Kalyan: నా అన్నయ్యలు నన్ను ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు: పవన్ కల్యాణ్

  • నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నది అభిమానులే
  • దెందులూరు ఎమ్మెల్యేల్లాంటోళ్లు యూపీ, బీహార్లో వీధికొకరు ఉంటారు
  • అలాంటి వాళ్లను ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాన్షీరామ్
తన సొంత కుటుంబసభ్యులు, తన అన్నయ్యలు చిరంజీవి, నాగబాబులు తనను ఎలా అర్థం చేసుకున్నారో తనకు తెలియదని... తనను పూర్తిగా అర్థం చేసుకున్నది మాత్రం మీరేనంటూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన బహిరంగసభకు హాజరైన అభిమానులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్ అంటే ఏమిటో అర్థంకావడం లేదని ఈ మధ్య ఓ రాజకీయ నేత అన్నారని... దీనికి సమాధానంగా ఓ పెద్దాయన మాట్లాడూతూ, టూరింగ్ టాకీస్ ఉన్న ప్రతి ఊర్లోని ప్రజలకు పవన్ అంటే పూర్తిగా అర్థమయ్యాడని, మీకే అర్థం కాలేదని ఎద్దేవా చేశారని చెప్పారు.

తనకు కాన్షీరామ్ అంటే చాలా గౌరవమని... బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బహుజన్ సమాజ్ పార్టీని నిర్మించిన గొప్పనేత ఆయనని పవన్ తెలిపారు. దెందులూరు ఎమ్మెల్యేల్లాంటోళ్లు అక్కడ వీధికొకరు ఉంటారని... అలాంటి వాళ్లను ఛేదించుకుంటూ ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారని చెప్పారు. సంకల్పం బలంగా ఉంటే అనుకున్నది సాధిస్తామని తెలిపారు.
Pawan Kalyan
Chiranjeevi
nagababu

More Telugu News