Mallu Bhatti Vikramarka: భట్టి విక్రమార్కను కలసిన గద్దర్!

  • భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లిన గద్దర్
  • రాష్ట్ర భవిష్యత్తు కోసం గద్దర్ లాంటి వారు కలసి రావాలన్న భట్టి
  • ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అందరూ సహకరించాలి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కతో ప్రజా గాయకుడు గద్దర్ భేటీ అయ్యారు. భట్టి విక్రమార్క నివాసానికి వచ్చిన ఆయన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తెచ్చుకున్నామని... రాష్ట్ర భవిష్యత్తు కోసం కవులు, కళాకారులు, గద్దర్ లాంటి వారు కలసి రావాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు... ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని విన్నవించారు. ఏ లక్ష్యాల కోసమైతే తెలంగాణను సాధించుకున్నామో... ఆ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 
Mallu Bhatti Vikramarka
Gaddar
meet

More Telugu News