Somuveerraju: ప్రధాని మోదీ నైతికతకు చిహ్నం...చంద్రబాబు అనైతికతకు చుక్కాని : సోము వీర్రాజు

  • కేంద్రం ఇచ్చిన నిధుల వల్లే రాష్ట్రం అభివృద్ధి
  • అవార్డుల ఘనత కూడా కేంద్రానిదే
  • రాష్ట్రం అమలు చేస్తున్న పథకాల్లో అవినీతిపై ఉద్యమం
బీజేపీ సీనియర్‌ నాయకుడు సోము వీర్రాజు తనదైన రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ నైతికతకు చిహ్నమైతే, సీఎం చంద్రబాబు అనైతికతకు చుక్కాని అని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు.

కేంద్రం ఇతోధికంగా నిధులు విడుదల చేయడం వల్లే రాష్ట్రం అభివృద్ధి సాధించిందని, ఇందులో బాబు గొప్పతనం ఏమీ లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అవార్డులు వచ్చాయంటే అది కూడా కేంద్రం పుణ్యమేనన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను కూడా అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై పెద్దఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు.
Somuveerraju
Chandrababu
Andhra Pradesh

More Telugu News