pranay: నా జీవితం నాశనమైపోయినా మా అమ్మ.. నాన్ననే సపోర్ట్ చేస్తోంది!: అమృత వర్షిణి

  • తన పరువే ముఖ్యమని నాన్న చెప్పేవారు
  • జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించేవారు
  • తల్లి మీడియా ముందుకు రాకపోవడంపై ఆవేదన
ప్రణయ్ అమ్మానాన్నలు తనను కన్నకూతురి కంటే ఎక్కువగా చూసుకున్నారని అమృత వర్షిణి తెలిపింది. తన కంట్లో నలకపడ్డా తండ్రి మారుతీరావు తట్టుకోలేడన్న ప్రచారం బయట జరుగుతోందనీ, అది నిజం కాదని వెల్లడించింది.

‘నీ సంతోషం కంటే నా పరువే నాకు ముఖ్యం. జాగ్రత్తగా ఉండు’.. అంటూ తన తండ్రి హెచ్చరించేవాడని పేర్కొంది. బాబాయ్ శ్రవణ్ కుమారుడు తనతో అసభ్యంగా ప్రవర్తిస్తే, కనీసం అతడిని మందలించడం కానీ, కొట్టడం కాని చేయలేదని వాపోయింది. తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్ తనను విపరీతంగా కొట్టేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజు ఓ టీవీ ఛానల్ తో అమృత మాట్లాడింది.

ప్రణయ్ ను హత్య చేసినప్పటికీ తన తల్లి తండ్రి మారుతీరావునే సపోర్ట్ చేస్తోందనీ, అందుకే ఇప్పటివరకూ బయటకు రాలేదని విమర్శించింది. ప్రణయ్ హత్య కేసులో తన తల్లి పాత్ర ఎంతవరకూ ఉందో తనకు తెలియదని వ్యాఖ్యానించింది. తన జీవితం నాశనం అయిపోయిందన్న బాధ కంటే, భర్త మారుతీరావును ఎలా బయటకు తీసుకురావాలన్న విషయమై తల్లి ఎక్కువగా బాధపడుతోందని అమృత తెలిపింది. ప్రణయ్ ను ప్రాణాలతో తీసుకొస్తేనే తన తండ్రిని క్షమిస్తానని స్పష్టం చేసింది.
pranay
amruta
Nalgonda District
miryalaguda
honour killing
marutirao

More Telugu News