Tanushree Dutta: నానా పటేకర్‌కు పొగరెక్కువ.. కానీ వేధించే రకం మాత్రం కాదు!: నటి రీమీ సేన్

  • నానా పటేకర్‌కు రిమీ సేన్ మద్దతు
  • ఒంటరితనం వల్ల ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు
  • నేను కూడా ఆయనతో పనిచేశాను
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా-సీనియర్ నటుడు నానా పటేకర్ వివాదంలోకి మరో నటి రీమీ సేన్ ఎంటరైంది. తనుశ్రీ ఆరోపిస్తున్నట్టు నానా పటేకర్ లైంగిక వేధింపులకు గురిచేసే రకం కాదని, అయితే, పొగరు మాత్రం కొంచెం ఎక్కువని పేర్కొంది. ఈ సందర్భంగా నానా పటేకర్‌తో తాను పనిచేసిన సందర్భాలను గుర్తు చేసుకుంది.

తాను అతడితో పనిచేసినప్పుడు అంతా మంచిగానే ఉందని తెలిపింది. అయితే, జీవితంలో ఒంటరితనం కారణంగా అప్పుడప్పుడు కొంత ఫ్రస్ట్రేషన్‌కు గురవుతుంటాడని వివరించింది. అతడో షార్ట్ టెంపర్ మనిషని, అంతే తప్ప లైంగిక వేధింపులకు గురిచేసే వ్యక్తం మాత్రం కాదని స్పష్టం చేసింది.

ఒంటరిగా ఉండడం వల్లనో ఏమో మహిళల కంపెనీని అతడు ఇష్టపడతాడని రీమీ సేన్ పేర్కొంది. తననైతే ఎప్పుడూ మానసికంగా, శారీరకంగా వేధించలేదన్నది మాత్రం నిజమని తేల్చి చెప్పింది. నిజానికి తనను ఆయన తన కుమార్తెలా చూసుకునేవాడని వివరించింది.

కాగా, తనుశ్రీ దత్తా ఇటీవల నానా పటేకర్, గణేశ్ ఆచార్య, ప్రొడ్యూసర్, డైరెక్టర్‌‌లు తనతో అసభ్యంగా ప్రవర్తించారని సంచలన ఆరోపణలు చేసింది. కాగా, తనపై తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై స్పందించిన నానా పటేకర్ ఆమెకు లీగల్ నోటీసులు పంపాడు.
Tanushree Dutta
Nana Patekar
Rimi Sen
sexual offender
Bollywood

More Telugu News