cs: ఏపీ కొత్త సీఎస్ గా అనిల్ చంద్ర పునేట!

  • వెలువడనున్న ఉత్తర్వులు
  • 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర
  • ప్రస్తుతం ఆయన భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్
ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేట పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా,1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేట. రాజంపేట సబ్ కలెక్టర్ గా తన కెరీర్ ని ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా, ఉద్యాన, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆయన పని చేశారు. ప్రస్తుతం భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ గా పునేట ఉన్నారు.
cs
anil chandra puneta

More Telugu News