Pawan Kalyan: తెలంగాణలో పోటీపై పవన్ కల్యాణ్ స్పందన!

  • పశ్చిమగోదావరి జిల్లాలో కాలుష్యం పెరిగిపోయింది
  • రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి
  • రాజకీయ నాయకుల వల్ల పెట్టుబడులు కూడా రావడం లేదు
తెలంగాణ ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తెలంగాణలో పోటీ గురించి ఆలోచిస్తామని చెప్పారు. తనకు తెలిసినంత వరకు పశ్చిమగోదావరి జిల్లా పచ్చగా ఉండేదని... ఇప్పుడు కాలుష్యం పెరిగిపోయిందని అన్నారు. డెల్టా ప్రాంతమంతా చేపల చెరువులుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీనికంతా రాజకీయ నాయకులే కారణమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్నంతా గమనిస్తున్నారా? లేదా ఆయనే రెచ్చగొడుతున్నారా? అనే విషయం తనకు అర్థం కావడం లేదని తెలిపారు.

గతలో తాను లండన్ కు వెళ్లినప్పుడు అక్కడ కొంతమంది వ్యాపారవేత్తలను కలిశానని... ఏపీకి మీరు ఎందుకు రావడం లేదని వారిని ప్రశ్నిస్తే... మీ రాజకీయ నేతలు వాటా అడుగుతున్నారని చెప్పారని పవన్ అన్నారు. మన రాజకీయ నేతల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రావడం లేదని విమర్శించారు. 
Pawan Kalyan
Chandrababu
janasena
Telugudesam

More Telugu News