Errabelli: పాలకుర్తిలో ఎర్రబెల్లికి తీవ్ర వ్యతిరేకత ఉంది: ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు రవీందర్ రావు

  • వరంగల్ తూర్పు నుంచి ఎర్రబెల్లి పోటీ చేయాలి
  • పాలకుర్తి టికెట్ ను నాకు కేటాయించాలి
  • లేకపోతే త్వరలోనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తా
ఎన్నికల ప్రచారపర్వంలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓ వైపు దూసుకుపోతుంటే... మరోవైపు అదే స్థాయిలో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడున్నాయి. పాలకుర్తి నియోజకవర్గ టికెట్ ను ఎర్రబెల్లికి కేటాయించడంపై ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎర్రబెల్లిపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన తెలిపారు. టీడీపీలో పనిచేసి, ప్రస్తుతం ఎర్రబెల్లితోనే ఉన్న పలువురు నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారని అన్నారు.

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష మేరకు వరంగల్ తూర్పు నుంచి ఎర్రబెల్లి పోటీ చేయాలని రవీందర్ రావు చెప్పారు. పాలకుర్తి స్థానం నుంచి పోటీ చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు కల్పించాలని కోరారు. ఎర్రబెల్లినే పోటీలో నిలపాలని భావిస్తే... ఉద్యమకారులతో చర్చించి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. మరోవైపు ఇప్పటికే ఎర్రబెల్లి, రవీందర్ రావుల అనుచరుల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతుండటం గమనార్హం. 
Errabelli
takkellapalli ravinder rao
palakurthi
warangal east
TRS

More Telugu News