Vijayawada: విజయవాడలో అనుచరుల హల్ చల్.. సీరియస్ గా స్పందించిన చింతమనేని ప్రభాకర్!

  • చింతమనేని ఫొటో ఉన్న కారుతో ర్యాష్ డ్రైవింగ్
  • ట్రాఫిక్ కానిస్టేబుల్ పై యువకుల దాడి
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులమని చెబుతూ కొందరు యువకులు నిన్న అర్ధరాత్రి విజయవాడలో హల్ చల్ చేశారు. కారులో వెళుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఇష్టానుసారం జంప్ చేయడంతో కారును ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను దుర్భాషలాడారు. చింతమనేని ఫొటోను కారుపై తగిలించుకున్న యువకులు ‘మా బండినే ఆపుతావా?’ అంటూ కానిస్టేబుల్ ను తీవ్రంగా తిట్టారు.

అనంతరం కారును స్టేషన్ కు తీసుకెళ్లాలని అనడంతో రెచ్చిపోయిన సదరు వ్యక్తులు కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. దీంతో బాధితుడు గవర్నర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. దాడికి పాల్పడ్డ యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పందించారు. కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డ వ్యక్తులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


Vijayawada
Chinthamaneni Prabhakar
Police

More Telugu News