Student: పట్టుజారి జలపాతంలో పడ్డ యువకుడు... వీడియో!

  • 200 అడుగుల లోయలో పడ్డ విద్యార్థి
  • వెన్నెముకకు తీవ్ర గాయం
  • వైరల్ అవుతున్న వీడియో
ఓ జలపాతం వద్ద పట్టుతప్పి 200 అడుగుల లోయలోకి పడిపోయిన ఓ విద్యార్థి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒడిశా పశ్చిమ ప్రాంతంలోని బారాగర్ జిల్లా, డియోదరా హిల్ లోని నలీచుహాన్ జలపాతం వద్ద ఈ ఘటన జరిగింది. డిప్లొమా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి రాహుల్ దాస్ (18) తన స్నేహితులతో కలసి జలపాతం వద్దకు వెళ్లిన వేళ ఈ ఘటన చోటు చేసుకుంది.

తన ముగ్గురు స్నేహితులతో కలసి వాటర్ ఫాల్ వద్దకు వెళ్లిన తరువాత, తన ఫోన్ నుంచి మిగతా స్నేహితుల ఫొటోలను తీసిన రాహుల్, వారి వద్దకు వెళ్లే క్రమంలో షూ జారి లోయలోకి పడిపోయాడు. రాహుల్ లోయలో పడిపోతున్న దృశ్యాలను అతని మరో మిత్రుడు చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ ప్రమాదంలో రాహుల్ వెన్నెముకకు తీవ్ర గాయం అయింది. గురువారం నాడు వైద్యులు రాహుల్ కు శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడారు.
Student
Odisha
Waterfall
Viral Videos

More Telugu News