Pawan Kalyan: ముద్దులు పెట్టినంత మాత్రాన వారి సమస్యలు తీరిపోవు: జగన్ పై పవన్ కల్యాణ్ సెటైర్లు

  • వృద్ధాప్యంలో తల్లిదండ్రులు బాధపడటం మంచిది కాదు
  • నేను సీఎం అయితే వృద్ధులకు ఏమేం చేయాలో అన్నీ చేస్తా
  • యువకులకు ఉపాధిని కల్పిస్తా
ఒక వృద్ధురాలు తనపై చూపించిన ఆప్యాయతకు తాను కరిగిపోయానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. ఆమె తన నుంచి ఎంతో ఆప్యాయతను, ప్రేమను కోరుకుందని... ఆ సందర్భంగా తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని, కళ్లు చెమ్మగిల్లాయని తెలిపారు. అప్పడు తనకు ఒకటే అనిపించిందని... రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల కోసం వృద్ధాశ్రమాలు ఎందుకు కట్టించడం లేదని అనిపించిందని చెప్పారు.

తాను ముఖ్యమంత్రిని అయితే వృద్ధుల సంక్షేమం కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తానని తెలిపారు. పిల్లల్ని కని, పెంచి, చదివించి, ప్రయోజకులను చేసి... వృద్ధాప్యంలో తల్లిదండ్రులు బాధపడటం మంచిది కాదని చెప్పారు. ముద్దులు పెడితే సరిపోదని పరోక్షంగా వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి విమర్శించారు. యువకులకు ఉద్యోగాలను కల్పించడం కూడా తన ప్రధాన లక్ష్యమని చెప్పారు.
Pawan Kalyan
jagan
janasena
YSRCP

More Telugu News