Revanth Reddy: రేవంత్ ఇంట్లో కోటిన్నర నగదు, బంగారం స్వాధీనం... ఈడీ అదుపులో సోదరుడి భార్య!

  • డబ్బు ఎక్కడిదో చెప్పాలని రేవంత్ ను అడిగిన ఈడీ
  • సరైన సమాధానం ఇవ్వకపోవడంతో స్వాధీనం 
  • బ్యాంకు లాకర్లను తెరిపించేందుకు కొండల్ రెడ్డి భార్యను తీసుకెళ్లిన అధికారులు
హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కోటిన్నర రూపాయల నగదు, పెద్దఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో చెప్పాలని అధికారులు వేసిన ప్రశ్నలకు రేవంత్ సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. బంగారు నగలపైనా బిల్లులు చూపాలని అధికారులు అడగ్గా, అవి తమ పూర్వీకుల నుంచి వచ్చినవని రేవంత్ కుటుంబీకులు సమాధానం ఇచ్చినట్టు అనధికార వర్గాల భోగట్టా.

 దీంతో వాటిని ప్రస్తుతం స్వాధీనం చేసుకుంటున్నామని అధికారులు వెల్లడించినట్టు తెలిసింది. మరోవైపు రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి మాదాపూర్ లో నివాసం ఉంటుండగా, ఆయన ఇంట్లోనూ నిన్నటి నుంచి తనిఖీలు జరుగగా, ఈ తెల్లవారుజామున 5 గంటలకు సోదాలు ముగించామని అధికారులు ప్రకటించారు. కొండల్ రెడ్డి భార్యను అదుపులోకి తీసుకున్న అధికారులు, బ్యాంకు లాకర్లను తెరిచేందుకు తీసుకెళ్లారు. ఆ లాకర్లలో కొన్ని ముఖ్యమైన దస్త్రాలు ఉండివుండవచ్చని ఈడీ భావిస్తోంది.
Revanth Reddy
Kondal Reddy
Hyderabad
Raids
ED
IT

More Telugu News