kcr: కేసీఆర్ పాత కేసులను తిరగదోడతాం.. జైలుకు పంపుతాం: కోమటిరెడ్డి

  • కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకుంటాం
  • ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తున్నారు
  • కేసీఆర్ నియంతృత్వానికి కాలం చెల్లింది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరినీ కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని... ఆయనపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. మొన్న తనను, సంపత్ ను... నిన్న జగ్గారెడ్డిని వేధించారని... ఈరోజు రేవంత్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే... కేసులన్నీ తిరగదోడి కేసీఆర్ ను జైలుకు పంపుతామని హెచ్చరించారు. కేసీఆర్ నియంతృత్వానికి కాలం చెల్లిందని చెప్పారు. గాంధీభవన్ లో దామోదర రాజనరసింహతో కలసి మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 
kcr
Revanth Reddy
komatireddy

More Telugu News