ghantasala rathnakumar: మా అనుమతి తీసుకునే 'ఘంటసాల' బయోపిక్ తీయాలి: ఘంటసాల తనయుడు రత్నకుమార్
- ఘంటసాల బయోపిక్ కోసం ఎవరూ సంప్రదించలేదు
- మా అనుమతిని కోరలేదు
- చట్టపరమైన చర్యలు తీసుకుంటాను
సావిత్రి బయోపిక్ గా వచ్చిన 'మహానటి' భారీ విజయాన్ని సాధించడంతో, తెలుగులో బయోపిక్ ల జోరు ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే 'ఘంటసాల ది గ్రేట్' అనే పేరుతో ఆయన బయోపిక్ నిర్మితమవుతున్నట్టుగా ఇటీవల ఒక వార్త వచ్చింది. ఈ విషయంపై విలేకరులతో మాట్లాడుతూ ఘంటసాల తనయుడు రత్నకుమార్ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారు.
"ఘంటసాల గారి బయోపిక్ కి సంబంధించి మా కుటుంబ సభ్యులను ఎవరూ కలవలేదు. మా నుంచి ఎలాంటి అనుమతులను .. మద్దతును పొందలేదు. మాకు చెప్పకుండా మా నాన్నగారి జీవితచరిత్రను ఎలా తీస్తారు? మా మనోభావాల మాటేమిటి? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై నేను చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాను .. మా నాన్నగారి బయోపిక్ ను ఎవరు చేయాలన్నా వాళ్లు మా అనుమతిని పొందవలసిందే .. స్క్రిప్ట్ చూపించవలసిందే" అని తేల్చి చెప్పారు.