ayodhya: దీనికి విస్తృత ధర్మాసనం అవసరం లేదు!: అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు

  • విస్తృత ధర్మసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదన్న బెంచ్
  • అక్టోబర్ చివరివారంలో విచారిస్తామని వెల్లడి
  • మెజారిటీ తీర్పుతో విభేదించిన జస్టిస్ నజీర్
అయోధ్యలో రామమందిరం- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును ఐదుగురు జడ్జీల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో తీర్పును ఇచ్చింది.

ఈ కేసును సుప్రీంకోర్టు అక్టోబర్ చివరివారంలో విచారిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీసుకునే తుది నిర్ణయంపై 1994లో ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో ఇచ్చిన తీర్పు ఎలాంటి ప్రభావం చూపబోదని ధర్మాసనం తేల్చిచెప్పింది. కాగా, ఈ తీర్పు విషయంలో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ లతో జస్టిస్ అబ్దుల్ నజీర్ విభేదిస్తూ, విస్తృత ధర్మాసనానికి నివేదించాలని అభిప్రాయపడ్డారు.  
ayodhya
Uttar Pradesh
Supreme Court
ram mandir
babri masjid
constitutional bench
judgement

More Telugu News