Pawan Kalyan: ఆకు రౌడీ, వీధి రౌడీ పేర్లు పవన్ సినిమాలకు బాగా సరిపోతాయ్!: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సెటైర్
- తనను రాజ్యాంగేతర శక్తిగా చెప్పడంపై మండిపాటు
- బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని వెల్లడి
- పవన్ నిరాధార విమర్శలు చేశారని ఆవేదన
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న చేసిన విమర్శలపై దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనను పవన్ రాజ్యాంగేతర శక్తిగా చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమైనా ప్రజల మానప్రాణాలకు భంగం కలిగించానా? అని చింతమనేని ప్రశ్నించారు. తాను చట్టాలు ఉల్లంఘించినట్లు వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి ముగ్గురు సభ్యులతో కమిటీ నియమిస్తే.. దానిపై కూడా పవన్ విమర్శలు చేశారన్నారు.
పవన్ తనకు ఇష్టమైన వ్యక్తులతో కమిటీ నియమించుకోవాలనీ, నెల రోజుల తర్వాత తనతో బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. తనను వీధి రౌడీ, ఆకు రౌడీ అని పవన్ సంబోధిస్తున్నారనీ, ఆ పేర్లను రిజస్టర్ చేసుకుంటే ఆయన సినిమాలకు సరిగ్గా సరిపోతాయని ఎద్దేవా చేశారు. దెందులూరులో పవన్ కల్యాణ్ తన గురించి గంటపాటు మాట్లాడారనీ, అన్నీ అసత్య ఆరోపణలే చేశారని చింతమనేని విమర్శించారు.
నిజంగా తాను చేసిన తప్పుల గురించి చెబితే సరిదిద్దుకుంటాననీ, సానుకూల విమర్శలు చేస్తే స్వాగతిస్తానని అన్నారు. తొలుత దెందులూరు ప్రజలు, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలు, చివరికి పార్టీ అధినేత చంద్రబాబు తనకు హైకమాండ్ అని చింతమనేని స్పష్టం చేశారు. పవన్ చేసిన అర్థం లేని విమర్శలతో తన జీవితంలో తొలిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు.