Revanth Reddy: రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసింది... లాయర్ రామారావు!

  • సీబీఐకి ఫిర్యాదు చేసింది లాయర్ రామారావు
  • డొల్ల కంపెనీలతో రూ. 300 కోట్ల మనీ లాండరింగ్
  • ఫిర్యాదును ఈడీకి రిఫర్ చేసిన సీబీఐ
ఈ ఉదయం నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై జరుగుతున్న ఐటీ, ఈడీ అధికారుల దాడులు కలకలం సృష్టిస్తుండగా, ఈ దాడుల వెనుక రామారావు అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదే కీలకమని తెలుస్తోంది. ఇటీవల సీబీఐకి రామారావు ఫిర్యాదు చేస్తూ, రేవంత్ బంధువు జయప్రకాశ్ తదితరులు 10 నుంచి 15 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి రూ. 300 కోట్లకు పైగా నిధులను మళ్లించారని ఆయన ఆరోపించారు. సాయిమౌర్య ఎస్టేట్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ తరఫున, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదు చేసినట్టు సమాచారం. హైదరాబాద్, జూబ్సీహిల్స్ పరిధిలోని ఇంటి నంబర్-346 చిరునామాతో ఈ కంపెనీలు ఉన్నాయని కూడా ఆయన ఉప్పందించగా, ఈ ఫిర్యాదును పరిశీలించాలని సీబీఐ నుంచి ఈడీకి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది.
Revanth Reddy
Money Laundering
Lawyer Ramarao
CBI
ED

More Telugu News