Adultry: పరస్పర సమ్మతితో జరిగే శృంగారం నేరం కాదు... సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

  • సెక్షన్ 497పై కొంతకాలంగా వాదనలు
  • తీర్పిచ్చిన సీజే దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం
  • మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చట్టం ఉందన్న న్యాయమూర్తులు
పరస్పర సమ్మతితో జరిగే శృంగారం నేరం కాదని సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం సంచలన తీర్పు ఇచ్చింది. అడల్ట్రీపై సెక్షన్ 497పై గత కొంతకాలంగా విచారిస్తున్న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పిచ్చింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో మెజారిటీ న్యాయమూర్తులు పరస్పర సమ్మతితో జరిగే శృంగారం నేరం కాదని తీర్పిచ్చారు.

సెక్షన్ 497 మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. ఇదే సమయంలో వ్యభిచారం, అక్రమ సంబంధాలు, వివాహేతర బంధాల కారణంగా విడాకులు తీసుకుంటున్న ఘటనల సంఖ్య పెరిగిపోతున్నదని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. పెళ్లయిన తరువాత ఓ యువతి తన వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయేలా సెక్షన్ 497 చేస్తోందని అభిప్రాయపడింది.
Adultry
Prostitution
Supreme Court

More Telugu News