Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు? ఫోన్ స్విచ్చాఫ్!

  • ఉదయం నుంచి ఈడీ, ఐటీ దాడులు
  • అందుబాటులోకి రాని రేవంత్ రెడ్డి
  • రేవంత్ కుటుంబీకుల ఫోన్లు కూడా స్విచ్చాఫ్
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డికి హైదరాబాద్, కొడంగల్ లో ఉన్న ఇళ్లతో పాటు, ఆయన బంధువుల ఇళ్లలో ఈ ఉదయం నుంచి ఎన్‌ ఫోర్స్‌ మెంట్, ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా, ప్రస్తుతం రేవంత్ ఎక్కడ ఉన్నారన్న విషయమై సమాచారం అందడం లేదు. ఆయన్ను సంప్రదించాలని, దాడులపై స్పందన కోరాలని తెలుగు టీవీ చానళ్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.

సోదాలు జరుగుతున్న ప్రాంతాల్లో రేవంత్ కుటుంబీకుల ఫోన్లను అధికారులు స్విచ్ ఆఫ్ చేయించడంతో అసలు దాడులు ఎందుకు చేస్తున్నారన్న విషయమై పూర్తి స్పష్టత ఇంకా రాలేదు. ఇప్పుడు రేవంత్ ఎక్కడున్నారన్న విషయమై ఆయన ప్రధాన అనుచరులకు కూడా సమాచారం లేకపోవడం గమనార్హం.
Revanth Reddy
ED
IT
Raids

More Telugu News