Tirumala: టీటీడీ బ్రేక్ దర్శన టికెట్లపై ఫిర్యాదులు.. జేఈఓ శ్రీనివాసరాజు నేతృత్వంలో తనిఖీలు!

  • అధిక ధరలకు బ్రేక్ దర్శన టికెట్లు
  • వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
  • తనిఖీల్లో పట్టుబడిన దళారీలు
వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల దందా తిరుమలలో మరోసారి బయటపడింది. సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటం, తరచూ దళారీలు పట్టుబడుతూ ఉండటంతో నేటి ఉదయం జేఈఓ శ్రీనివాసరాజు స్వయంగా రంగంలోకి దిగారు. వీఐపీ బ్రేక్‌ దర్శనానికి టికెట్లతో వచ్చిన భక్తులను ఆయన నేతృత్వంలోని బృందం తనిఖీలు చేపట్టింది. దీంతో నేటి తనిఖీల్లోనూ భారీగా దళారీలు పట్టుబడ్డారు.  
Tirumala
Tirupati
TTD

More Telugu News