Uttam Kumar Reddy: నిన్న జగ్గారెడ్డి, నేడు రేవంత్ రెడ్డి... పిరికి కేసీఆర్!: ఉత్తమ్

  • ఓడిపోతామన్న భయంతో దాడులు
  • దొంగదారిన దెబ్బతీయాలని చూస్తున్న కేసీఆర్
  • నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్, తమ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడని, అందుకు ప్రభుత్వ సంస్థలను వాడుకుంటున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

ఈ మేరకు ఆయన త్న ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "మొదట జగ్గారెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పిరికితనాన్ని ఇది స్పష్టంగా చూపిస్తోంది. కాంగ్రెస్ కు చెందిన ఏ నేతనూ ఎదుర్కొనే శక్తిలేని వారు, ఇలా దొంగదారిన దెబ్బతీయాలని చూస్తున్నారు. అతి త్వరలోనే తెలంగాణ నిరంకుశ పాలన నుంచి బయట పడుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఐకమత్యంగా ఉండి టీఆర్ఎస్ ను ఎదిరించి పోరాడతారు" అని ఆయన అన్నారు
Uttam Kumar Reddy
Revanth Reddy
KCR
Telangana

More Telugu News