Nairuti: మూడు రోజుల్లో వెనుదిరగనున్న నైరుతి పవనాలు!

  • ఉత్తరాదిలో కొనసాగుతున్న నైరుతి
  • అక్టోబర్ 10 నాటికి ఏపీని దాటనున్న నైరుతి
  • ఆ తరువాతే ఈశాన్య రుతుపవనాల ప్రభావం
  • వెల్లడించిన వాతావరణ శాఖ

ఉత్తరాదిలో కొనసాగుతున్న నైరుతి రుతుపవనాలు వెనుదిరిగేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో రాజస్థాన్‌ పశ్చిమ ప్రాంతం నుంచి రుతుపవనాలు తిరోగమన బాట పట్టనున్నాయని అన్నారు. కాగా, నైరుతి ప్రవేశించిన తరువాత ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన ప్రభావం కనిపించలేదు. వాస్తవానికి ఈ సమయానికి రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు రావాల్సివుంది. అయితే, నైరుతి రుతుపవనాల తిరోగమనం ఆలస్యమైనందువల్ల ఈశాన్య రుతుపవనాల రాక  సాధ్యం కాలేదు. వచ్చే నెల 10 నాటికి నైరుతి ఆంధ్రప్రదేశ్ ను దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తరువాత ఈశాన్య రుతుపవనాల ప్రభావం కనిపిస్తుందని అంటున్నారు.

  • Loading...

More Telugu News