Chandrababu: చంద్రబాబుపై కేసులు పెడితే కోర్టులకు సమయం చాలదు: సోము వీర్రాజు

  • చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయారు
  • ప్రకృతి వ్యవసాయాన్ని కనిపెట్టింది పాలేకర్
  • ఆ ఘనత తనదిగా బాబు చెప్పుకోవడం సిగ్గుచేటు
ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయారని, ఆయనపై కేసులు పెడితే వాటిని విచారించేందుకు కోర్టులకు సమయం చాలదని వ్యంగ్యంగా అన్నారు. ఏపీకి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ పథకాన్ని ఆయన అవినీతిమయం చేశారని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితిలో ప్రకృతి వ్యవసాయం అంశంపై ప్రసంగించేందుకు చంద్రబాబును ఆహ్వానించడంపైనా ఆయన విమర్శలు చేశారు. ప్రకృతి వ్యవసాయాన్ని కనిపెట్టింది పాలేకర్ అని, ఇది తన ఘనతగా చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  
Chandrababu
somu veeraj

More Telugu News