sonu sood: అమ్మ ఆశీర్వాదంతోనే డాక్టరేట్ అందుకున్నా!: సోనూసూద్

  • సోనూసూద్‌కి తైక్వాండోలో డాక్టరేట్
  • అంతర్జాతీయ క్యోరుగి రెఫరీ సెమినార్‌కు హాజరు
  • అమ్మ ఉంటే చాలా సంతోషించేదన్న సోనూ
ఎన్నో సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రలో మెప్పించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సోనూసూద్‌కి తైక్వాండోలో డాక్టరేట్ లభించింది. చిన్నతనం నుంచే తైక్వాండోలో శిక్షణ తీసుకున్నానని, యాక్షన్ సినిమాలతో దానిని మరింత మెరుగు పరుచుకున్నానని సోనూ తెలిపారు. ఢిల్లోలో 107 అంతర్జాతీయ క్యోరుగి రెఫరీ సెమినార్‌కు హాజరైన ఆయనకు  తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా‌ సెక్రటరీ జనరల్‌ ప్రభాత్‌ శర్మ డాక్టరేట్‌ను అందించారు.

ఈ సందర్భంగా సోనూ మాట్లాడుతూ, తైక్వాండోలో డాక్టరేట్ తీసుకోవడం గర్వంగా ఉందన్నారు. తను చిన్నప్పుడు శిక్షణకు వెళ్లిన రోజులు నేటికీ గుర్తేనన్నారు. అమ్మ ఉండి ఉంటే బాగుండేదని.. చాలా సంతోషించేదని సోనూ తెలిపారు. అమ్మ ఆశీర్వాదం కారణంగానే తనకు డాక్టరేట్ వచ్చిందని అన్నారు. 
sonu sood
doctorate
delhi
prabhath sharma
action movies

More Telugu News