Chandrababu: చంద్రబాబుపై వేసినవి తప్పుడు కేసులని తేలినా కొందరికి బుద్ధి రావట్లేదు: టీడీపీ ఎంపీ కనకమేడల
- చంద్రబాబు, లోకేశ్ ను అపఖ్యాతి పాల్జేసే ప్రయత్నాలు
- ఇకనైనా ఆ ప్రయత్నాలను మానుకోవాలి
- హైకోర్టు వెలువరించిన తీర్పుతోనైనా కళ్లు తెరవాలి
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై హైకోర్టులో దాఖలైన అక్రమాస్తుల పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు, లోకేశ్ ను అపఖ్యాతి పాల్జేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇకనైనా ఆ ప్రయత్నాలను మానుకోవాలని, ఇప్పటికే చంద్రబాబుపై వేసిన అనేక కేసులు తప్పుడు కేసులని తేలినప్పటికీ, కొందరికి బుద్ధి రావట్లేదని వ్యాఖ్యానించారు. ఈరోజు హైకోర్టు వెలువరించిన తీర్పుతోనైనా కళ్లు తెరవాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తే మంచిదని సూచించారు.