Chandrababu: చంద్రబాబుపై వేసినవి తప్పుడు కేసులని తేలినా కొందరికి బుద్ధి రావట్లేదు: టీడీపీ ఎంపీ కనకమేడల

  • చంద్రబాబు, లోకేశ్ ను అపఖ్యాతి పాల్జేసే ప్రయత్నాలు
  • ఇకనైనా ఆ ప్రయత్నాలను మానుకోవాలి
  • హైకోర్టు వెలువరించిన తీర్పుతోనైనా కళ్లు తెరవాలి
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై హైకోర్టులో దాఖలైన అక్రమాస్తుల పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు, లోకేశ్ ను అపఖ్యాతి పాల్జేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇకనైనా ఆ ప్రయత్నాలను మానుకోవాలని, ఇప్పటికే చంద్రబాబుపై వేసిన అనేక కేసులు తప్పుడు కేసులని తేలినప్పటికీ, కొందరికి బుద్ధి రావట్లేదని వ్యాఖ్యానించారు. ఈరోజు హైకోర్టు వెలువరించిన తీర్పుతోనైనా కళ్లు తెరవాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తే మంచిదని సూచించారు. 
Chandrababu
mp kanamedela

More Telugu News