polavaram: పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడంపై పిటిషన్.. ఈసీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

  • ముంపు మండలాలను ఏపీలో కలపడం రాజ్యాంగ విరుద్ధమన్న పిటిషనర్
  • తెలంగాణ భూభాగంతో పాటు ఓటర్లను కూడా నష్టపోతామంటూ ఆవేదన
  • కౌంటర్ దాఖలు చేయాలంటూ ఈసీని ఆదేశించిన హైకోర్టు
పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ఏడు ముంపు మండలాలను ఏపీలో కలపడంపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో కలపడం వల్ల... తెలంగాణ భూభాగంతో పాటు ఓటర్లను కూడా తాము నష్టపోతామని పిటిషనర్ పేర్కొన్నారు. ముంపు మండలాలను ఏపీలో కలపడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. 
polavaram
7 mandals
High Court
Telangana
Andhra Pradesh

More Telugu News