kondagattu: కొండగట్టులో నారాయణబలి హోమంలో పాల్గొన్న పరిపూర్ణానంద స్వామి

షార్ట్స్‌లో చూడండి
కొండగట్టులో ఇటీవల జరిగిన బస్సు ప్రమాద సంఘటన ఎంతటి విషాదం నింపిందో తెలిసిందే. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుతూ కొండగట్టులో నిర్వహించిన నారాయణ బలిహోమంలో పరిపూర్ణానంద స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ, ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, ప్రేతాత్మ విముక్తి కలగాలని కోరుతూ ఈ హోమం చేస్తున్నట్టు చెప్పారు.

మృతుల కుటుంబీకులకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, అకాల మృత్యు దోషం కారణంగా ఈ ప్రాంతానికి ఎటువంటి అరిష్టాలు కలగకూడదని, ఇటువంటి ఘోర విపత్తుల నుంచి ఈ ప్రాంతం బయటపడాలని, అందరికీ శాంతి చేకూరాలని, ఈ రాష్ట్రానికి మంచి చేకూరాలని కోరుతూ నారాయణ బలి హోమం, శాంతి కార్యక్రమాలను నిర్వహించారని అన్నారు.

ఈ కార్యక్రమాలను బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి బృందం శాస్త్రోక్తంగా నిర్వహించిందని చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించానని, ఇలాంటి కార్యక్రమం చేసి వాళ్లకు కడుపు నిండా భోజనం పెడదామని తనకు అనిపించిందని చెప్పారు.
Go Back to Shorts
kondagattu
paripurnananda swamy
narayana bali homam

More Telugu News