mim: 'గణపతి బప్పా మోరియా' అన్నందుకు క్షమాపణలు చెప్పిన ఎంఐఎం ఎమ్మెల్యే

  • ముంబైలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న వారిన్ పఠాన్
  • పార్టీ అధిష్ఠానం సీరియస్
  • తప్పు చేశాను.. క్షమించాలన్న ఎమ్మెల్యే
మహారాష్ట్రకు చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే వారిన్ పఠాన్ క్షమాపణలు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే, ముంబై బైకుల్లాలోని గణపతి మండపంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 'గణపతి బప్పా మోరియా' అంటూ నినాదాలు చేశారు. ఈ అంశంపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. దీంతో, ఆయన క్షమాపణలు చెప్పారు. తాను తప్పు చేశానని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అన్నారు. తాను కూడా మనిషినేనని, అందుకే పొరపాటు జరిగిందని చెప్పారు. చేసిన తప్పుకు బాధ పడుతున్నానని... అల్లా తనను క్షమించాలని కోరారు. ఇస్లాంలో విగ్రహారాధన నిషిద్ధం అనే విషయం తెలిసిందే.
mim
mla
Maharashtra
warin pathan
ganesh

More Telugu News