Kollu Ravindra: చంద్రబాబు నిప్పు.. అందుకే ఒక్క కేసునూ రుజువు చేయలేకపోయారు!: కొల్లు రవీంద్ర

  • చంద్రబాబుపై ప్రతిపక్షాల అసత్య ఆరోపణలు
  • వైసీపీతో రాష్ట్రం పరువు పోతోంది
  • గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి
చంద్రబాబుపై ప్రతిపక్షాలు, ఇతరులు వేసిన కేసులు ఒక్కటీ రుజువు కాలేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ముఖ్యమంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు అభాసుపాలు అవుతున్నాయని చెప్పారు. ప్రతిపక్ష వైసీపీతో ఆంధ్రప్రదేశ్ పరువు పోతోందని విమర్శించారు. హైకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబు, లోకేశ్ పై అక్రమాస్తుల పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో చంద్రబాబు నిప్పు అన్న విషయం మరోసారి రుజువైందని రవీంద్ర వ్యాఖ్యానించారు. గుంటూరులో ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశంలోనే ఎక్కడా లేనివిధంగా నిరుద్యోగుల కోసం 'ముఖ్యమంత్రి యువనేస్తం' పథకాన్ని ప్రారంభించామని రవీంద్ర తెలిపారు. దీనికింద ఇప్పటివరకూ 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. మంత్రి నారా లోకేశ్ గతంలో విసిరిన చాలా సవాళ్లకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందించలేదని రవీంద్ర పేర్కొన్నారు.
Kollu Ravindra
Andhra Pradesh
Chandrababu
YSRCP
High Court
Jagan
Nara Lokesh

More Telugu News