Tamilnadu: నా కుమార్తెను చంపేశారు... ఫిర్యాదు చేసిన తమిళనాడు ఎస్ఐ!

  • చెన్నై వాల్ టాక్స్ రోడ్డులో యాక్టివాపై వెళుతున్న రమ్య
  • లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలతో మృతి
  • ప్లాన్ ప్రకారం లారీతో ఢీకొట్టించారంటున్న తండ్రి
తన కుమార్తె రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, మామ, బావమరిది కలిసి ప్లాన్ ప్రకారం హత్య చేయించారని తమిళనాడులో స్పెషల్ ఎస్ఐగా పనిచేస్తున్న తుళసింగం పోలీసులను ఆశ్రయించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఆయన కుమార్తె రమ్య (28), ఓ బ్యూటీపార్లర్ లో పనిచేస్తూ, సోమవారం విధులు ముగించుకుని తన యాక్టివాపై ఇంటికి వెళుతుండగా, చెన్నై, సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలోని వాల్ టాక్స్ రోడ్డులో వెనుకనుంచి వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొంది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో పోలీసులు లారీ డ్రైవర్ పళనిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రమాదం కాదని ఆరోపిస్తూ, తుళసింగం ఎలిఫెంట్ గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామ రత్తినం, బావమరిది ఎత్తిరాజ్ కలసి ప్లాన్ చేసి కుమార్తెను లారీతో గుద్దించారని ఆయన ఆరోపిస్తుండగా, పోలీసులు విచారణ జరుపుతున్నామని తెలిపారు.
Tamilnadu
Chennai
Waltax Road
Murder
Road Accident
Ramya

More Telugu News