Hyderabad: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం!

  • ఉదయం 11 గంటల నుంచి వర్షం
  • రోడ్లపైకి చేరిన వర్షపు నీరు
  • వాహనదారుల ఇబ్బందులు
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం 11 గంటల నుంచి భారీ వర్షం పడుతోంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్‌, కవాడిగూడ, రామ్ నగర్‌, చిక్కడపల్లి, నాంపల్లి, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.

ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. ఎర్రగడ్డ, కూకట్ పల్లి, మాదాపూర్ ప్రాంతంలో చిరు జల్లులు మాత్రమే కురిశాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
Hyderabad
Rain
Roads
Water

More Telugu News