KTR: తెలంగాణ, ఆంధ్రాలను విలీనం చేస్తారట... ఇక మీ ఇష్టం!: కేటీఆర్

  • వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు
  • ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన కేటీఆర్
  • ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్య
వరంగల్ జిల్లాలో ఓ సభలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలను తన ట్విట్టర్ ఖాతాలో గుర్తు చేసిన కేటీఆర్, ఇదే 'స్కాంగ్రెస్ రహస్య అజెండా' అని కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇదే నిజమైన, రహస్య అజెండా అని నేను అనుకుంటున్నాను. స్కాంగ్రెస్ కు చెందిన ఈ మాజీ ఎంపీ, ప్రజలను బెదిరిస్తున్నారు. తమ పార్టీకి ఓటు వేయకుంటే, తిరిగి తెలంగాణను ఏపీలో కలుపుతారట. ఎంత అహంకారం? తెలంగాణ ప్రజలు వీరికి గుణపాఠం చెప్పనున్నారు" అని వ్యాఖ్యానించారు.

ఇదే పోస్టులో ఆయన ఓ వీడియోను కూడా షేర్ చేసుకున్నారు. ఆ వీడియోలో "చెయ్యి గుర్తుకు ఓటేసి, చెయ్యి గుర్తును గెలిపీయాలే. లేకపోతే మన తెలంగాణను మాత్రం... దీన్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలుపుతాం" అంటున్నట్టు వినిపిస్తోంది.
KTR
Telangana
Congress
Andhra Pradesh

More Telugu News